నర్సాపూర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని బీవీరాజు ఇంజనీరింగ్ కాలేజీలో కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్టు (అనలిస్ట్ గ్రేడ్–2), అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం శనివారం రెండు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలను తహసీల్దార్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఉదయం సెషన్‌కు 85 మంది, మధ్యాహ్నం పరీక్షకు 87 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎస్ఐ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


