కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: అటవీ విస్తీర్ణం పెంపుదల, కలప, జంతువుల స్మగ్లింగ్ అరికట్టడమే ధ్యేయమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అటవీ, కార్మికశాఖలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎస్ సంజయ్ జాజు నిర్వహించిన పీఎం రాహత్ కార్యక్రమంతో పాటు సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ భూ రీసర్వేపై వేర్వేరుగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ముందుగా జిల్లా అటవీ శాఖ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అడవుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని, సరిహద్దులను జియో–ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించాలని నిర్ణయించారు. అటవీ, పోలీస్‌శాఖలు సంయుక్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించా రు. అనంతరం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో టీ ఫైబర్ ఇంటర్నెట్ ఏర్పాటు చేయడంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ–ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, డీఎఫ్‌ఓ జోజీ, ఎస్టీ వెల్ఫేర్ అధికారిణి నీలిమ, ఈడీఎం సందీప్, డీఎస్పీ ప్రసన్న కుమార్, లేబర్ అధికారులు సత్యేంద్ర ప్రసాద్, తిరుపతి, సీడబ్ల్యూఏసీ చైర్మన్ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.


