న్యూస్‌రీల్
రెండు జిల్లాల్లో ప్రారంభం
గడిచిన కాలంలో వందలాది మూగజీవాల మృతి పాడిగేదెల పెంపకంపై రైతుల నిరాసక్తత
ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
మెతుకుసీమ అంటేనే వ్యవసాయంతో పాటు పాడి గేదెలు, పశుపోషణకు పెట్టింది పేరు. అయితే కొంతకాలంగా ప్రభుత్వం పశుపోషణపై శీతకన్ను వేసింది. ఏదేని ప్రమాదంతో పాడి గేదెలు, పశువులు, గొర్రెలు మృత్యువాత పడితే వాటికి బీమా కరువైంది. ఫలితంగా పశువులు పెంచాలంటేనే రైతులు జంకుతున్నారు. ఈక్రమంలో కొత్తగా అమూల్ పాల చిల్లింగ్ పరిశ్రమ జిల్లాలో ఏర్పాటు కాబోతుంది. ఈ తరుణంలో పాడి, పశు పోషకులకు మంచి రోజులొచ్చేనా..? అనే చర్చ
మొదలైంది. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 1,52,524 తెల్ల, నల్లజాతి పాడి పశువులు ఉన్నాయి. అలాగే గొర్రెలు, మేకలు 4.50 లక్షలు ఉన్నాయి. 8 ఏళ్లుగా జిల్లాలో మూగజీవాలు, పాడి పశువులకు బీమా లేక పోవటంతో ఏటా వందలాది పశువులు ప్రమాదంలో చనిపోతున్నా పరిహారం రావటం లేదు. ఫలితంగా వాటిపై ఆధారపడి జీవనం సాగించే పోషకులు రోడ్డున పడుతున్నారు. 2018 నుంచి మూగ జీవాలకు బీమా కరువైంది. ఇప్పటి వరకు జిల్లాలో 700 పైచిలుకు మృత్యువాత పడగా ఇక గొర్రెలు, మేకలు 2 వేలకు పైగా మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో పాడి పశువులు పిడుగుపాటు, కరెంట్‌షాక్, గాలికుంటు వ్యాధి తదితర కారణాలతో చనిపోతుంటే.. గొర్రెలు, మేకల మందలపై వీధి కుక్కలు దాడి చేయడం, రైలు ప్రమాదంలో మృత్యువాత పడటం, సీజనల్ వ్యాధులు, తదితర కారణాలతో మరణిస్తున్నాయి. అదే వీటికి బీమా చేసేందుకు ప్రైవేట్ కంపెనీలు ముందుకు రాకపోవటం, ప్రభుత్వం ఇందుకు సంబంధించి తగు చర్యలు తీసుకోకపోవటంతో పశువుల పెంపకం అంటేనే జంకుతున్నారు.
‘అమూల్’తో మంచి రోజులొచ్చేనా?
జిల్లాలో అమూల్ పాల చిల్లింగ్ పరిశ్రమను సుమారు రూ. 4 వేల కోట్లతో తూప్రాన్ సమీపంలో నిర్మించనున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వాలు పాడి, పశువులకు బీమా సౌకర్యం కల్పించే అవకాశం ఉందా..? అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఒక్కో గేదె ధర ప్రస్తుతం రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు ఉంటుంది. ఏదేని ప్రమాదంతో చనిపోతే సదరు పాడి రైతు కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది. 8 ఏళ్లకు ముందు రాష్ట్రంలో పాడి, పశువులతో పాటు గొర్రెలకు బీమా సౌకర్యం ఉంది. వాటి విలువ (ధర)లో 5 శాతం బీమా చెల్లించే వారు. అందులో సగం పశు పోషకులు చెల్లిస్తే మిగితా సగం ప్రభుత్వం చెల్లించేది. దీంతో ప్రమాదంలో మరణిస్తే పాడి గేదెకు రూ. 50 వేలు, గొర్రెకు రూ. 3 వేల చొప్పున బీమా సదరు పోషకుడికి వచ్చేది.
ఎనిమిదేళ్లుగా నిరీక్షణ
8 సంవత్సరాలుగా పాడి పశువులతో పాటు గొర్రెలకు ఇన్సూరెన్స్ లేక వాటి పశు పోషకులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో గొర్రెలకు బీమా చేస్తునట్లు తెలుస్తోంది. అక్కడ పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
త్వరలో అమలు
కొంతకాలంగా పాడి పశువులు, గొర్రెలకు బీమా లేకపోవటంతో పశు పోషకులు నష్టపోతున్నారు. ఇటీవల కరీంనగర్, గద్వాల జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా గొర్రెలకు ప్రభుత్వం బీమా చేస్తుంది. త్వరలో మెదక్‌లోనూ అమలు కానుంది.
– ఆదిత్యవర్మ, జిల్లా వెటర్నరీ అధికారి


