రేపు జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

మెదక్‌కలెక్టరేట్‌: మెదక్‌లోని గుల్షన్‌ క్లబ్‌లో సోమవారం సీనియర్‌ మహిళా కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణులు 75 కిలోల లోపు బరువు కలిగి ఉండాలన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామ న్నారు. పూర్తి వివరాలకు 8885728286, 9989175382 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

నార్సింగి సబ్‌స్టేషన్‌కు రూ.25.87 లక్షల నిధులు

టీజీఈఆర్‌సీ సభ్యుడు శశిధర్‌రెడ్డి

పాపన్నపేట(మెదక్‌): మండలంలోని నార్సింగి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.25.87 లక్షలు మంజారైనట్లు టీజీఈఆర్‌సీ సభ్యుడు శశిధర్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సబ్‌స్టేషన్‌లో సింగిల్‌ కంట్రోల్‌ రూం, గేట్‌, పిల్లర్లతో కూడిన ఫెన్సింగ్‌, స్విచ్‌యార్డులో మెటల్‌, సైడ్‌ పిల్లర్ల ఎత్తు పెంపు కోసం నిధులు మంజూరైనట్లు వివరించారు.

ఇంకుడుగుంతలు తప్పనిసరి

కౌడిపల్లి(నర్సాపూర్‌): భూగర్భజలాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్‌ పిలుపునిచ్చారు. శనివారం ఎంపీఓ రామారావుతో కలిసి కౌడిపల్లి ఉన్నత పాఠశాలలో సామాజిక ఇంకుడుగుంత నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. ఇంటి అవసరాలకు వినియోగించిన నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకేలా చూడాలన్నారు. దీంతో భూగర్భజలాల అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యం, దోమల బెడద తప్పుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శ్వేత, ఏపీఓ పుణ్యదాస్‌, ఈసీ ప్రేమ్‌కుమార్‌, కార్య దర్శి నగేశ్‌, ఎల్లం, నాయకులు సత్యనారాయణగౌడ్‌, శరత్‌, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్మించారు.. వదిలేశారు

నర్సాపూర్‌: మున్సిపల్‌ అధికారులు రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన టాయిలెట్స్‌ మూడేళ్లుగా వృథాగా ఉన్నాయి. పట్టణంలో మూడు చోట్ల స్వచ్ఛభారత్‌ పేరిట పురుషులు, మహిళలకు వేర్వేరుగా మూడు స్వచ్ఛ టాయిలెట్లు నిర్మించారు. ఒక్కో టాయిలెట్‌ నిర్మాణానికి రూ.12 లక్షల చొప్పున, మూడింటికి రూ. 36 లక్షలు వెచ్చించారు. అయితే ఎస్‌బీఐ ఎదురుగా ఉన్న టాయిలెట్‌, బస్టాండ్‌లోని టాయిలెట్‌ను కొన్ని నెలల పాటు నిర్వహించి మూసివేశారు. కోమటికుంట వద్ద నిర్మించిన టాయిలెట్‌ను మాత్రం ఇప్పటివరకు ప్రారంభించ లేదు. ఇదే విషయమై మున్సిపల్‌ మేనేజర్‌ మధుసూదన్‌ వివరణ కోరగా.. స్వచ్ఛ టాయిలెట్స్‌ నిర్వహణ మున్సిపాలిటీకి భారం కావడంతో మూసి వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆయా సంస్థలతో చర్చిస్తున్నామని, వారు అంగీకరించగానే మూడు టాయిలెట్స్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పకడ్బందీగా రీ సర్వే: ఆర్డీఓ

హవేళిఘణాపూర్‌(మెదక్‌): భూభారతి రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి సిబ్బందికి సూచించారు. శనివారం మండల పరిధిలోని బొగుడభూపతిపూర్‌లో ఆమె సర్వేను ప్రారంభించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు భూ వివాదాలు లేకుండా, హద్దులను గుర్తించి సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. అధికారులకు సహకరించి భూభారతి సర్వే వేగవంతంగా జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోశెట్టి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement