రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? | - | Sakshi
Sakshi News home page

రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా?

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

● ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్‌ ● నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌

● ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్‌ ● నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌

వెల్దుర్తి(తూప్రాన్‌)/కొల్చారం(నర్సాపూర్‌): వ్యవసా యానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. విద్యుత్‌ కోతలతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ మాసాయిపేట మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ ఎదుట జాతీయ రహదారి 44పై రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. సబ్‌స్టేషన్‌ను సందర్శించి వ్యవసాయానికి రోజుకు ఎన్ని గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. అనంతరం ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. బోరు బావులు, ఇతరత్రా మార్గాన నీరు పుష్కలంగా ఉన్నా అప్రకటిత విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో పొలాలకు నీరు అందక పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. పంట నష్టాపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారంతో పాటు, క్రాప్‌ హాలిడే కింద మరో రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేకు రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement