అదనపు కలెక్టర్ నగేశ్
చిన్నశంకరంపేట(మెదక్): పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం మండలంలోని ప్యాటగడ్డలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాలని కోరారు. ప్రభుత్వం అందించే రూ. 5 లక్షలతో ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని కోరారు. గ్రామంలో 12 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. పిల్లర్లు లేకుండా తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, ఎంపీఓ వినోద్, ఏఈ లోకేష్, కార్యదర్శి యోగేశ్వర్, సర్పంచ్ లావణ్య పాల్గొన్నారు.


