తీరనున్న రవాణ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తీరనున్న రవాణ కష్టాలు

Oct 26 2026 7:48 AM | Updated on Oct 26 2026 7:48 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ మండలం కోంటూర్‌ నుంచి చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌ వరకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల గుంతలు తీసి కల్వర్టులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుతో రెండు వాహనాలు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. దీంతో సెంట్రల్‌ రోడ్డు ఫండ్‌ రూ.22 కోట్లతో 14 కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మెదక్‌ మండలం తిమ్మానగర్‌ శివారులో నుంచి మట్టిని తీసుకువచ్చి రోడ్డుకు ఇరువైపులా పోస్తున్నారు. ప్రస్తుతం రైతుల పంట పొలాలకు ఇబ్బంది కలుగకుండా మట్టిని పోసి సిద్ధంగా ఉంచారు. ఎక్కడెక్కడా కల్వర్టులు అవసరం ఉన్నా యో గుర్తించి వాటిని కూడా నిర్మించే పనులు సా గుతున్నాయి. ముఖ్యంగా నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న కోంటూర్‌ చెరువు అలుగు వద్ద బ్రిడ్జి, తిమ్మానగర్‌ శివారులో గతంలో రోడ్డుతో కొట్టుకుపోయిన రోడ్డు వద్ద మరో బ్రిడ్జి, రాయిన్‌పల్లి మీదుగా కోంటూర్‌ వెళ్లే కాలువపై మరో బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిసింది.

తగ్గనున్న దూరాభారం

కోంటూర్‌ పరిసర గ్రామాల ప్రజలు రామాయంపేట వెళ్లాలంటే చేగుంట, మెదక్‌ మీదుగా వెళ్లాల్సి ఉండేది. దీంతో దూరం ఎక్కువగా ఉండేది. ఈ రోడ్డు వెంట వెళ్లాలన్న ఇరుకుగా ఉండడంతో ప్రజలు నానా అవస్థలు పడేవారు. రోడ్డు నిర్మాణం జరిగితే త్వరగా చేరుకునేందుకు దూరంతో పాటు సమయం ఆదా కానుంది. ఈ ప్రాంతానికి రవాణా సదుపాయం మెరుగుపడనుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుకు ఇరువైపులా పోసిన మట్టి

రవాణ సదుపాయం మెరుగు

కోంటూర్‌– ఖాజాపూర్‌ వరకు 14 కిలోమీటర్ల మేర నిర్వహించే ఈ రోడ్డుతో ప్రజలకు రవాణ సదుపాయం మెరుగుపడనుంది. దీని ద్వారా రామాయంపేట ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఇరుకుగా ఉన్న రోడ్డు వెడల్పు చేసేందుకు వీలు కల్పించడం సంతోషకరం.

– యాదగిరి, సర్పంచ్‌, వెంకటాపూర్‌

కోంటూర్‌– ఖాజాపూర్‌ రోడ్డు పనులు షురూ

సుమారు 14 కిలోమీటర్ల మేర నిర్మాణం

రూ. 22 కోట్ల నిధుల కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement