పైప్లైన్ పగిలి వృథాగా పోతున్న నీరు
ఎల్నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు, నీటి వృథాను అరికట్టడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వద్ద నెల రోజులుగా మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి విలువైన తాగునీరు వృథాగా పోతుంది. కళాశాల ప్రధాన ద్వారం మూసివేసిన అధికారులు, అదే సమయంలో అక్కడ కాలువను తవ్వారు. అయితే జేసీబీతో పనులు చేస్తున్న సమయంలో పైప్లైన్ పగిలిపోయింది. మరమ్మతులు దేవుడెరుగు, కనీసం నీటి వృథాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. – చిన్నశంకరంపేట(మెదక్)


