అడ్డగోలుగా మద్యం దుకాణాలు | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా మద్యం దుకాణాలు

Oct 2 2026 7:20 AM | Updated on Oct 2 2026 7:20 AM

అడ్డగోలుగా మద్యం దుకాణాలు నాణ్యమైన భోజనం అందించాలి వీబీజీ రాంజీతో MýS*Î-ÌSMýS$ E´ë«¨˘ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఖాదిరాబాద్‌ విద్యార్థులు

నర్సాపూర్‌: గ్రామంలో కల్లు, మద్యం దుకాణాలు అడ్డగోలుగా ఏర్పాటు చేసి అమ్ముతున్నారని శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు ఎకై ్సజ్‌ సీఐ కార్యాలయంలో ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌, ప్రశాంత్‌, బాబు తదితరులు గురువారం స్థానిక సీఐ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు దుకాణం, బెల్టుషాప్‌లు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తమ గ్రామ పరిధిలోని ప్రముఖ ఆలయం సమీపంలో కల్లు, మద్యం దుకాణాలు ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడుతున్న కల్లు, మద్యం దుకాణాలపై విచారణ చేసి అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉపేందర్‌

వెల్దుర్తి(తూప్రాన్‌): వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఉపేందర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు వెల్దుర్తి బీసీ హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని రికార్డులు, వంటశాల, తరగతి గదులు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యార్థుల గదులను పరిశీలించారు. వసతి గృహంలో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వార్డెన్‌ సుజాతకు సూచించారు. విద్యార్థుల వసతి, భోజనం, పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పంచాయతీ రాజ్‌ జాయింట్‌

కమిషనర్‌ శ్రీలక్ష్మి

కల్హేర్‌(నారాయణఖేడ్‌): కులీలకు ఉపాధి పనులు కలించేందుకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ–రాంజీ పథకం అమలు చేస్తుందని పంచాయతీ రాజ్‌ జాయింట్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి తెలిపారు. సిర్గాపూర్‌ మండలం కడ్పల్‌, పోచాపూర్‌లో గురువారం కేంద్ర బృందం అధికారులు పర్యటించారు. వీబీజీ–రాంజీ పథకం కింద జరుగుతున్న పనులు పరిశీలించడంతోపాటు పనులు చేసే విధానం, డబ్బులు చెల్లింపు, తదితర అంశాలపై చర్చించారు. కూలీలు పనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొలతల ప్రకారం డబ్బులు చెల్లించడం జరుగుతుందని, నిబంధనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ బాలరాజు, ఏపీడీ శ్రీదేవి, ఎంపీడీఓ అండలమ్మ, ఏపీఓ నర్సింహులు పాల్గొన్నారు.

వట్‌పల్లి(అందోల్‌): మండల పరిధిలోని ఖాదిరాబాద్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. సంగారెడ్డిలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీల్లో అండర్‌–17 విభాగంలో పాఠశాలకు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జి.ఆంజనేయులు. పి.అభిలాష్‌ స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికవగా, జి.నాగరాజు,ఎం.హరీశ్‌, జి.చరణ్‌రాజ్‌, యండి.హైమద్‌ రజత పతకాలు సాధించారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దిగంబర్‌రావు తెలిపారు. విద్యార్థులతో పాటు వారికి శిక్షణనిచ్చిన పీఈటీ సంగ్రామ్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement