4న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాక | - | Sakshi
Sakshi News home page

4న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాక

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ శ్రీనివాస్‌రావు

తూప్రాన్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అక్టోబర్‌ 4న తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లి రైల్వేగేట్‌ సమీపంలో అమూల్‌ పాల పరిశ్రమకు కేంద్ర మంత్రి భూమి పూజ చేయనున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌, పార్కింగ్‌ ఏరియాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. వీవీఐపీల పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల పట్ల సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, సీఐలు సందీప్‌రెడ్డి, రంగాకృష్ణ, ఆర్‌ఐ శైలేందర్‌, ఎస్‌ఐలు గంగరాజు, సుభాష్‌గౌడ్‌ ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

లాభాల్లో మహమ్మద్‌నగర్‌ సొసైటీ

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని మహమ్మద్‌నగర్‌ సొసైటీ లాభాల బాటలో నడుస్తుందని చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. బుధవారం సొసైటీలో మహజన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీలో 3,526 మంది రైతులకు సభ్యత్వం ఉండగా, రూ 1.1 కోట్ల షేర్‌ అమౌంట్‌ ఉందన్నారు. 1,187 మంది రైతులకు రూ 9.38 కోట్ల సాగు రుణాలు, 45 మంది రైతులకు రూ. 37 లక్షల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చామన్నారు. 2025–26 సంవత్సరం ఆడిట్‌రిపోర్ట్‌ ప్రకారం రూ. 52,97 లక్షల లాభాలు వచ్చినట్లు చెప్పారు. గత రబీ సీజన్‌లో 14 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.48 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. అనంతరం మూడు తీర్మానాలు చేశారు. ఇదిలాఉండగా ఇటీవల సొసైటీలో ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రూ.లక్షలు దో చుకున్న వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రవియాదవ్‌, డీసీసీబీ మేనేజర్‌ వేణుగోపాల్‌, ఇన్‌చార్జి సీఈఓ విష్ణు, డైరెక్టర్లు రాయగిరి, నర్సింలు, నాయకులు మహిపాల్‌రెడ్డి, వీరారెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ సాగుతో లాభాలు

హవేళిఘణాపూర్‌(మెదక్‌): రైతు ఉత్పత్తి సేవా కేంద్రాలను అభివృద్ధి చేసుకోవాలని డీఏఓ దేవ్‌కుమార్‌, డీసీఓ పద్మ రైతులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని తొగిట రైతు ఉత్పత్తి సేవా సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. రైతులు ప్రస్తుతం పంటలు బాగానే పండిస్తున్నా, అందులో కల్తీ అధికమై రోగాల బారిన పడుతున్నారన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరూ విడతల వారీగా సేంద్రియ వ్యవసాయం చేసే దిశగా ఉత్పత్తి కేంద్రాలపై ఆసక్తి చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రతీ రైతు ఆలోచించాలన్నా రు. కార్యక్రమంలో చైర్మన్‌ శ్యాంసుందర్‌, వైస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, సర్పంచ్‌ సౌమ్య, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సంబాజీ, ఏఓ బాల్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, ఎఫ్‌డీఓ డైరెక్టర్లు, సర్పంచ్‌ సాయిలు, రమేశ్‌, రైతులు త దితరులుపాల్గొన్నారు.

డీఏఓ దేవ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement