నేటి నుంచి జిల్లాలో పోలీస్‌యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జిల్లాలో పోలీస్‌యాక్ట్‌

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

నేటి నుంచి జిల్లాలో పోలీస్‌యాక్ట్‌ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ‘మోడల్‌’ విద్యార్థి దరఖాస్తుల ఆహ్వానం రేపటి నుంచి ‘సేవాసేతు’ క్యాంపులు బీఆర్‌ఎస్‌ హయాంలోనే భూ దోపిడీ

ఎస్పీ శ్రీనివాసరావు

మెదక్‌జోన్‌: జిల్లాలో గురువారం నుంచి పోలీస్‌యాక్ట్‌ అమలులో ఉంటుందని, ఈనెల 31 వరకు ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకోలు, ర్యాలీలు తీయవద్దని ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆందోళనలు, నిరసనలతో ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజల సాధారణ రాకపోకలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలకు అనుమతి ఉండదన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నర్సాపూర్‌ రూరల్‌: జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు మండలంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థినిని వై.గీతిక ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ ఫర్హాన, పీడీ అశోక్‌ తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ.. ఇటీవల మెదక్‌లో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో 14 సంవత్సరాల విభాగంలో గీతిక 60 మీటర్స్‌ లాంగ్‌జంప్‌లో ప్రథమ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈసందర్భంగా అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు.

మెదక్‌ కలెక్టరేట్‌: కొనుగోలు కేంద్రాల్లో పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం నుంచి ప్రారంభమవుతున్న ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని గుర్తించేందుకు బీఎస్సీ అగ్రికల్చర్‌ డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని తెలిపారు. రెండు నెలలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

ఎస్‌ఈ నారాయణనాయక్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రధానమంత్రి సూర్యఘర్‌, ముప్త్‌ బిజిలీ యోజన, ఎంఎన్‌ఆర్‌ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నారాయణ నాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 2, 3, 4 తేదీల్లో జిల్లా కేంద్రంలోని సేవాసేతు క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే పథ కం ద్వారా లభించే ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ వివరాలు, బ్యాంకు వారిచే ఆర్థిక సహాయం, సోలార్‌ ప్యానెల్ల ఏర్పాటుకు సంబంధించి వినియోగదారులకు అవగాహన కల్పించినున్నట్లు తెలిపారు.

రామాయంపేట(మెదక్‌): పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఎలాంటి అభివృద్ధికి పాటుపడలేదని కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్‌, సందీప్‌, పార్టీ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి పనుల పేరిట విలువైన స్థలాలను అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌, తహసీల్దార్‌ కార్యాలయ భవనాల నిర్మాణం, మినీ ట్యాంక్‌బండ్‌ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం మంజూరు చేయించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రోహిత్‌ రామాయంపేట అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమి టీ మాజీ అధ్యక్షుడు సరాపు యాదగిరి, కా ంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గణేశ్‌, జిల్లా నాయకులు డాకి స్వామి, కార్యదర్శి చింతల యాదగిరి, పట్టణాధ్యక్షుడు చింతల స్వామి, కోఆప్షన్‌ సభ్యులు యాదగిరి, గౌస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement