ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం

Sep 30 2026 7:36 AM | Updated on Sep 30 2026 7:36 AM

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం ఆరోపణలన్నీ నిరాధారమే విద్యార్థినికి చెట్ల ఆకులు తినిపించిన టీచర్‌

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లో ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను సంసిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లాలో 3.20 లక్షల హెక్టార్లలో వరి సాగు చేసినట్లు అంచనా వేశారు. దొడ్డు రకం–413, సన్న రకం–105 కేంద్రాలు మొత్తం 518 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నధాన్యానికి రూ.500ల బోనస్‌ లభిస్తుందన్నారు. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఽఽ దాన్యం మళ్లింపును అరికట్టేందుకు వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమర్చాలని సూచించారు. ముందస్తుగా క్షేత్రస్థాయిలో గోదాములను పరిశీలించి వాటి సామర్థ్యాన్ని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

పీఏసీఎస్‌ చైర్మన్‌ యశ్వంత్‌రెడ్డి

టేక్మాల్‌(మెదక్‌): తనపై అధికార పార్టీ నాయకులు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమేనని పీఏసీఎస్‌ చైర్మన్‌ యశ్వంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన టేక్మాల్‌లో పీఏసీఎస్‌ కార్యాలయంలో మంగళవారం మహజనసభ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలకు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనపై అధికార పార్టీ నాయకులు చేసి ఆరోపణలు, చేసిన ఫిర్యాదులన్నీ నిరాధారమని ఎటువంటి అవినీతి జరగలేదని హైకోర్టు కొట్టివేసిందని కాపీని చూపించారు. తాను అభివృద్ధి పనులు చేశాననే ప్రజలు రెండు పర్యాయాలు చైర్మన్‌గా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. పీఏసీఎస్‌ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని తనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి

మెదక్‌ కలెక్టరేట్‌: తమ పాపకు చెట్ల ఆకులు తినిపించి భయభ్రాంతులకు గురిచేస్తున్న టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి మంగళవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నర్సాపూర్‌ పట్టణ పరిధిలో గల నారాయణపూర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలో కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన గిరిజన విద్యార్థి దీప 8వ తరగతి చదువుతోంది. ఇటీవల తరగతి గది శుభ్రం చేస్తుండగా అందులో ఉన్న స్టూల్‌ మరో విద్యార్థినికి తగలడంతో పనిష్మెంట్‌ కింద విద్యార్థినిని బయటకు తీసుకెళ్లి చెట్ల ఆకులు తినిపించారు. దీంతో విద్యార్థినికి వాంతులు కావడంతో విద్యార్థిని తల్లితండ్రులకు పాఠశాల సిబ్బంది సమాచారం అందించారు. తల్లిదండ్రులు ఆ పాపను ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించి మళ్లీ పాఠశాలకు తీసుకెళ్లారు. మా కూతురుకు ఎందుకు చెట్ల ఆకులు తినిపించారని క్లాస్‌ టీచర్‌ శ్రీలతను ప్రశ్నించగా.. ఆగ్రహంతో తిట్టినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితిని పరిశీలించి స్కూల్‌ టీచర్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కలెక్టర్‌ను కోరారు.

నీట్‌ పరీక్షకు ఉచిత కోచింగ్‌

మునిపల్లి(అందోల్‌): ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు నీట్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు నీట్‌ పరీక్ష కోసం ఉచిత కోచింగ్‌ ప్రభుత్వమే ఇస్తుందని తహసీల్దార్‌ రంగారావు తెలిపారు. మునిపల్లి మోడల్‌ స్కూల్‌లో మంగళవారం 63 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు తెలిపారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హాస్టల్‌ వసతితోపాటు ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement