చుట్టూ పచ్చని చెట్లు, పొలాల మధ్యలో ఓ వేప చెట్టు ఎండిపోయి మోడు వారింది. మోడు వారిన చెట్టు కొమ్మలపైనే పలు కొంగలు వాలి సేదతీరాయి. నర్సాపూర్ సంగారెడ్డి మార్గం నుంచి తుల్జరాంపేటకు వెళ్లే దారి పక్కన పచ్చని పొలాలు, గట్లపై ఉన్న చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయి. వాటన్నిటి మధ్యలో ఓ వేప చెట్టు పూర్తిగా ఎండిపోయింది. చెట్టు ఎండి పోతేనేం..ఆ చెట్టు కొమ్మలే తమకు ఆధారమన్నట్లుగా పలు కొంగలు కొమ్మలపై వాలి సేదతీరాయి. కొమ్మలు ఎండి పోవడంతో నల్లగా మారాయి. చుట్టు పచ్చని పరిసరాల మధ్య ఎండి నల్లగా మారిన చెట్టు చిటారు కొమ్మలపై వాలిన కొంగలు నలుపు తెలుపు రంగుల్లో కొంచెం మెరుస్తుండగా చెట్టు వెనుకాల కన్పిస్తున్న నీలి ఆకాశంలో అక్కడక్కడా తెల్లటి మేఘాలు సూర్యుని కాంతికి మెరుస్తూ కనిపించాయి. –నర్సాపూర్


