ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
మెదక్ కలెక్టరేట్: అర్హులైన ప్రతీ నిరుపేద సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని ఎమ్మెల్యే రోహిత్‌రావు పేర్కొన్నారు. పదేళ్ల క్రితం ఇచ్చాం...మళ్లీ ఇప్పుడు మేమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని 32 వార్డుల్లోని అర్హులైన లబ్ధిదారులకు రెండు పడకల గదుల పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ...ప్రభుత్వం అందిస్తున్న రెండు పడకల పట్టాల ద్వారా పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అంతా అవినీతిమయంగా జరిగిందని విమర్శించారు. ఈ విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితనే చెబుతుందని తెలిపారు. అలాగే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన ఏ ఒక్కరికీ ఇల్లు అందలేదని విమర్శించారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు పట్టలేని ఆనందంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్‌చైర్మన్ నరేశ్‌గౌడ్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యంతోపాటు డీఈ, ఏఈలు, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ నవీన్, మున్సిపల్ కౌన్సిలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


