చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఖేలో ఇండియా జిల్లాస్థాయి రగ్బీ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 16 టీంలు, 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–15 బాలికల విభాగంలో చేగుంట స్పోర్ట్స్ స్కూల్ మొదటి స్థానం సాధించగా, టీజీఆర్‌ఎస్ మెదక్ రెండో స్థానం, ట్రైబల్ స్కూల్ నర్సాపూర్ మూడో స్థానం సాధించాయి. అండర్ –18 బాలికల విభాగంలో చేగుంట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ జట్టు మొదటి స్థానం, టీజీఆర్‌ఎస్ మెదక్ జట్టు రెండో స్థానం, టీజీటీడబ్ల్యూఆర్‌డీ మూడో స్థానం సాధించాయని జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు గణేశ్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరి తెలిపారు. పోటీలకు తెలంగాణ రగ్బీ అసోసియేషన్ డెవలప్‌మెంట్ మేనేజర్ శేషుబాబు, రిఫరీలుగా శ్రీధర్ నాయక్, మధునాయక్, రితీష్, రాకేష్, ఉమారాణి వ్యవహరించారు. కార్యక్రమంలో పీడీలు శారద, ప్రవీణ్, రజిత, దిలీప్, నర్సింలు, సౌందర్య, నిర్మల తదితరులు పాల్గొన్నారు.


