ఎమ్మెల్యే సంజీవరెడ్డి
పెద్దశంకరంపేట(మెదక్): గ్రామాల్లో తాగునీటి ఎద్దడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులకు సూచించారు. పెద్దశంకరంపేట మండల సమీక్ష సమావేశంతోపాటు మండల పరిధిలోని రామోజీపల్లి, కొత్తపేటలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టిన మహిళా సమాఖ్య భవనాలు, నారాయణపల్లిలో పాఠశాల ప్రహరీలను ప్రారంభించారు. అనంతరం స్థానిక రైతువేదికలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్‌కార్డులను అందజేశారు. గ్రామాల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను చేపడుతూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్, తహసీల్దార్ నారాయణ, ఇన్‌చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీ, హౌసింగ్ డీఈ విజయ, మిషన్‌భగీరథ డీఈలు బాలకృష్ణ, హరీశ్ నాయకులు నారాగౌడ్, మధు, మురళీ పంతులు, సంగమేశ్వర్, పెరుమాండ్లుగౌడ్ తదితరులున్నారు.


