పెద్దశంకరంపేట(మెదక్): చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శప్రాయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో ఖేడ్ ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్‌పాటిల్, మండల నాయకులు నారాగౌడ్, మురళిపంతులు, సుభాశ్‌గౌడ్, దాచ సంగమేశ్వర్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్‌లు వెంకట్‌రావు, కుమార్, ప్రశాంత్‌రెడ్డి, రాజుగౌడ్, మండల రజకసంఘం అధ్యక్షుడు చాకలి ప్రభు, వెంకటేశం, కిష్టయ్య, లక్ష్మణ్, సాయి, నరేశ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి


