● యాసంగిలో ఆ దిశగా రైతులు ముందుకు సాగాలి
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
మెదక్‌జోన్/హవేళిఘణాపూర్(మెదక్): ఎల్‌నినో ప్రభావంతో సరిగా వర్షాలు కురవక ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో నిర్వహించిన కిసాన్ మేళాకు ఆయా మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల పనిముట్లు, సాగు విత్తనాల స్టాళ్లను మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలన్నారు. ఆయిల్‌పామ్ సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని, ప్రభుత్వం సబ్సిడీ సైతం అందజేస్తుందన్నారు. గత ప్రభుత్వం సాగు కోసం ప్రాజెక్టులు నిర్మించి రూ. కోట్లు వృథా చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, డీఏఓ దేవ్‌కుమార్, ఆత్మ డీపీడీ రుద్రమూర్తి, ఏడీఏలు, ఏఓలు బాల్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్‌గౌడ్, కిరణ్‌గౌడ్, ఏఈఓ, ఆయా మండలాల పాల్గొన్నారు.
సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం అద్భుతం
సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రపంచంలోనే అద్భుత పథకమని మంత్రి వివేక్ అన్నారు. శనివారం పట్టణంలోనీ మార్కెట్ యార్డ్‌లో నూతనంగా నిర్మించిన కేంద్రీకృత కిచెన్‌ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి మాట్లాడారు. పౌష్టికాహారాన్ని హరేకృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో విద్యార్థులకు అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, డీఈఓ రాజు, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


