కాలేజీని ఇక్కడే కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

కాలేజీని ఇక్కడే కొనసాగించాలి

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల అప్‌గ్రేడెడ్‌ జూనియర్‌ కాలేజీని ఇక్కడే కొనసాగించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. శనివారం నర్సాపూర్‌–మెదక్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తమకు స్థానిక కాలేజీలో అడ్మిషన్లు ఇచ్చా రని, విద్యా సంవత్సరం మధ్యలో కౌడిపల్లి కాలేజీకి ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. కాగా కాలేజీ ప్రిన్సిపాల్‌ బసవరాజ్‌, గిరిజన గు రుకుల కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీఓఈ) ప్రిన్సిపాల్‌ బలరాం పలువురు లెక్చరర్లు విద్యార్థుల వద్దకు వచ్చి కాలేజీని ఇక్కడే కొనసాగిస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి కాలేజీ వద్దకు వచ్చి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాలేజీ ఇక్కడే ఉంటుందని ప్రస్తుత విద్యా సంసవత్సరంలో తాత్కాలికంగా సీఓఈ కాలేజీలో చేర్పించి చదివిస్తారని, వచ్చే ఏడాది యధావిధిగా అడ్మిషన్లు తీసుకుంటారని వివరించారు. ప్రభుత్వం ఇంకా పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం విచారకరమని, డ్రెస్సులు అడ్డగోలు సైజులతో ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement