వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

● ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియలు పూర్తి చేయాలి ● డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌

● ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియలు పూర్తి చేయాలి ● డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో వరిధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులతో బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు, డిజిటల్‌ క్రాప్‌ సర్వే, ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌ నుంచి డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌ కుమార్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారి నిత్యానంద్‌ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌ మాట్లాడారు. జిల్లాలో కొనసాగుతున్న ఫార్మర్‌ రిజిస్ట్రీ, డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రక్రియ వివరాలను సమీక్షించారు. మిగిలిన రిజిస్ట్రీ, డిజిటల్‌ క్రాప్‌ సర్వేను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఈ వీసీలో డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, కో ఆపరేటివ్‌ శాఖ అధికారి పద్మ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement