ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

ఎస్పీ శ్రీనివాసరావు

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ప్రాణానికి ముప్పు కలిగించే డీజేలను వాడకుండా గణేశ్‌ నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం హవేళిఘణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి, పెండింగ్‌ కేసులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో వేగం పెంచి, అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. గణేష్‌ నిమజ్జనానికి ముందు నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు. కొందరు డీజేలు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పండుగ వాతావరణాన్ని ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐలు సందీప్‌, కృష్ణమూర్తి, ఎస్‌ఐ సత్యనారాయణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement