కిమ్మనని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
వెుదక్ మున్సిపాలిటీ సుమారు 7 దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. ఇందులో 14 వేల పైచిలుకు ఇళ్లు ఉండగా సుమారు లక్ష వరకు జనాభా ఉంది. నిత్యం పట్టణం నుంచి 15 టన్నుల చెత్త వస్తుంది. 128 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరిలో చెత్త వాహనాలు నడిపే డ్రైవర్లతో పాటు, లేబర్స్, జవాన్లు సైతం ఉండగా అందులో కేవలం 30 మంది మాత్రమే పర్మినెంట్ వర్కర్లు. మిగతా వారంతా ఔట్‌సోర్సింగ్‌లో నియామకమైన వారే. వీరు తక్కువ జీతంతో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఏటా సరిపడే విధంగా గ్లౌస్‌లు, రేడియేషన్ ప్యాడ్స్, (ఆఫ్రాన్) రెయిన్‌కోర్టు లు, బూట్లు, మాస్కులు, ఆయిల్, సబ్బులు ఇవ్వాలి. కానీ గత ఏడాది మార్చిలో ఇచ్చిన అధికారులు నేటికీ ఇవ్వలేదు. దీంతో మురికి కాలువల నుంచి మురుగును ఎలాంటి రక్షణ లే కుండా చేతులతోనే ఎత్తి పోస్తున్నారు. నిత్యం చెత్తను చేతులతోనే ఎత్తుతూ వాహనాల్లో తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే కానీ.. వారిని పట్టించుకున్న పాపాన పోవటం లేదు.
నేటికీ అందని కనీస వస్తువులు దృష్టిసారించని అధికారులు
పారిశుద్ధ్య కార్మికుల వెతలు అన్నీఇన్నీకావు.. ఎలాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో వ్యర్థాలను చేతులతోనే ఎత్తిపోస్తున్నారు.. ఏటా అందాల్సిన వస్తువులు అందకపోవడం.. ఆరోగ్యానికి, ప్రాణాలకు తీవ్ర ప్రమాదమని తెలిసినా చేసేదిలేక రక్షణ పరికరాలు లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. డ్రైనేజీల్లో నెలల తరబడి పేరుకుపోయిన మురుగు.. కంపు కొడుతున్నా.. చేతులకు కనీసం గ్లౌజులు, ముక్కుకు మాస్కు లేకుండానే ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్నారు. ఈ దుస్థితి అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. – మెదక్‌జోన్
అసలే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది.. నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన వస్తువుల గురించి ప్రశ్నిస్తే ఆ మరుసటి రోజే విధుల్లో నుంచి తొలగిస్తారనే భయంతో మౌనంగా భరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీస రక్షణ పరికరాలు కార్మికులకు అందించాలని పలువురు కోరుతున్నారు.


