చిన్నశంకరంపేట ఆగ్రోస్ కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు
తూప్రాన్‌లో ఆందోళన చేస్తున్న రైతులు
యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. తూప్రాన్ పట్టణంలోని రైతు ఆగ్రోసేవా కేంద్రంలో బుధవారం యూరియా ఆందుబాటులో లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై ఆందోళన చేపట్టారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నప్పటికీ అందుబాటులో లేదని మండిపడ్డారు. ఇతర మండలాలకు చెందిన రైతులకు యూరియా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు స్పందించి రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అలాగే చిన్నశంకరంపేట ఆగ్రోస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు భారీ బారులుతీరారు. యాప్‌లో యూరియా బుక్ చేసుకున్నప్పటికీ, తెల్లవారుజాము నుంచే క్యూలో ఉన్నామని వాపోయారు. పాత పద్ధతిలోనే యూరియా బుక్ చేయాలని కోరుతున్నారు.
– తూప్రాన్/చిన్నశంకరంపేట(మెదక్)


