సింగపూర్‌ టూర్‌కు టీచర్‌ రవిరాజ్‌ | - | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ టూర్‌కు టీచర్‌ రవిరాజ్‌

Aug 27 2026 7:20 AM | Updated on Aug 27 2026 7:20 AM

సింగపూర్‌ టూర్‌కు టీచర్‌ రవిరాజ్‌ గుంట భూమి పోదు ‘జీఓ 39 రద్దు చేయాలి’

నర్సాపూర్‌ రూరల్‌: మండలంలోని అద్మాపూర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్‌ సింగపూర్‌ స్టడీ టూర్‌కు ఎంపికయ్యారు. టీచర్లకు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు ‘టీచర్స్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది టీచర్లను ఆర్జేడీ, డీఈఓల ద్వారా ఎంపిక చేయగా, రవిరాజును మాత్రం తెలంగాణ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ యోగితారాణా ప్రత్యేకంగా ఎంపిక చేయడంపై ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన శ్రమకు తగిన ఫలితం వచ్చిందని ఉపాధ్యాయుడు రవిరాజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. సింగపూర్‌లో అధ్యయనం చేసి వచ్చిన అనంతరం మరింత బాధ్యతతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తానని తెలిపారు.

జహీరాబాద్‌ టౌన్‌: నిమ్జ్‌ ప్రాజెక్టులోకి అదనంగా గుంట భూమి కూడా పోదని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మాజీ డీసీఎంఎస్‌ జిల్లా చైర్మన్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో మండలంలోని హద్నూర్‌కు చెందిన రైతులు హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిశారు. కొత్త సర్వే నంబర్లు జాబితాలో కనిపించడంతో ఈ విషయాన్ని హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే టీజీఐఐసీ ఈడీ వీరారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. సాంకేతిక లోపాల వల్ల కొత్త సర్వే నంబర్లు జాబితాలో కనిపించాయని, రెండు, మూడు రోజుల్లో సరిదిద్దుతామని ఆయన తెలిపారు. హరీశ్‌రావును కలిసిన వారిలో సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ షబ్బీర్‌, మాజీ సర్పంచ్‌ రాజ్‌కుమార్‌, నాయకులు చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

జహీరాబాద్‌ టౌన్‌: వ్యవసాయ శాఖలో సుధీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న డిప్లొమా ఏఈఓలకు అన్యాయం కల్గించే జీఓ 39ను రద్దు చేయా లని తెలంగాణ ఏఈఓ అసొసియేషన్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మాట్లా డుతూ 1976 నుంచి అమల్లో ఉన్న ఇన్‌సర్వీస్‌ బీఎస్సీ విధానాన్ని రద్దు చేయడం వల్ల ఏఈఓల ప్రమోషన్‌ అవకాశం శాశ్వతంగా దెబ్బతింటుందన్నా రు. 2005 నుంచి పనిచేస్తున్న సీనియర్లను పక్కనపెట్టి 2017లో చేరిన గ్రాడ్యుయేట్లకు ప్రమోషన్‌ ఇచ్చేలా 39 జీఓను రూపొందించార ని మండిపడ్డారు. ఈ జీఓతో రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది వ్యవసాయ విస్తరణ అధికారులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement