మాట్లాడుతున్న దేవ్‌కుమార్
రామాయంపేట(మెదక్): డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రైవేట్ వలంటీర్‌ను నియమిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో రైతులకు యూరియా యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము నియమించే వలంటీర్లు గ్రామాల్లో క్రాప్ సర్వే చేసేటప్పుడు సంబంధిత రైతు అక్కడే ఉండి పంట వివరాలు నమోదు చేయించాలని సూచించారు. క్రాప్ సర్వే ఆధారంగానే ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్నరకం వడ్లను కొనుగోలు చేసే క్రమంలో రైతులు డీలర్ వద్ద ఆన్‌లైన్‌లో నమోదు చేయించాల్సి ఉంటుందన్నారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని, రైతులకు అవసరమైనంత మేరకు యూరియా సిద్ధంగా ఉందని తెలిపారు. యూరియా యాప్ వినియోగం, రైతుల సందేహాలను వ్యవసాయ అధికారులు నివృత్తి చేశారు. ఏఓ ప్రవీణ్‌కుమార్, ఏఈఓలు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్


