మెదక్ కలెక్టరేట్: అర్హత గల ప్రతీ ఓటు హక్కును పరిరక్షించే విధంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రతిమాసింగ్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి సర్ కార్యక్రమంపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈనెల 27న నిర్వహించనున్న గ్రామ సభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ వన మహోత్సవంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


