రాజీవ్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ సేవలు చిరస్మరణీయం

Aug 21 2026 9:44 AM | Updated on Aug 21 2026 9:44 AM

మెదక్‌జోన్‌: భారతదేశాన్ని ఆధునికత, సాంకేతిక ప్రగతి వైపు నడిపించిన దార్శనిక నాయకుడు మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ అని ఎమ్మెల్యే రోహిత్‌రావు కొనియాడారు. రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతకు ప్రాధాన్యత, సాంకేతిక అభివృద్ధి విద్య, గ్రామీణ ప్రజాస్వామ్యం, ఆధునిక భారత నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చిన గొప్పనేత రాజీవ్‌ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌, మెదక్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కానుగు రాధిక భూపతిరాజు, వైస్‌ చైర్మన్‌ దొంతి నరేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రోహిత్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement