అమెరికాలో ఉచిత పీజీ మెడికల్ సీటు
మెదక్‌జోన్: పట్టణానికి చెందిన యువకుడు ప్రతిభ చాటాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ)లో మెడిసిన్‌లో పీజీ చదివేందుకు ఉచిత సీటు పొందాడు. పట్టణానికి చెందిన డాక్టర్ పోకల సురేష్–నీరజ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు వినయ్ చంద్ర హైదరాబాద్‌లోని అపోలో మెడికల్ కాలేజీలో ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అమెరికాలోని నార్త్‌వెస్ట్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు సంబంధించి మూడు పరీక్షలతో పాటు మూడు సార్లు నిర్వహించిన ఇంటర్వూలో ప్రతిభ కనబర్చి సీటు సాధించాడు. అమెరికాలో మెడిసిన్ పీజీ చేయడానికి లక్షల్లో పోటీపడుతుంటారని విద్యావేత్తలు చెబుతున్నారు. వినయ్ చంద్రకు ఉచితంగా సీటు రావటంతో ఆయన తల్లిదండ్రుల సంతోషానికి అవదులు లేకుండా పోయాయి.
రామాయంపేట(మెదక్): ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆరోపించారు. బుధవారం ఎంపీపీ కార్యాలయం ఎదుట కార్మికులు నిర్వహించిన రిలే దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీఎం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పంచాయతీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు సైతం అందడం లేదని, దీంతో వారు తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారని వాపోయారు. ఇప్పటికై నా వారి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఎంపీ రఘునందన్‌రావు
మర్కూక్(గజ్వేల్): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. పాములపర్తి నుంచి శివారు వెంకటాపూర్ వరకు మూడేళ్ల క్రితం బిగించిన వీధిలైట్లు వెలగకపోవడంతో ఇటీవల సాక్షిలో ప్రచురితమైన వీధిలైట్లు వెలిగేదెప్పుడు? అనే కథనానికి ఎంపీ స్పందించారు. బుధవారం మర్కూక్ మండలకేంద్రం, పా ములపర్తిలో వీధిలైట్లను మండల పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకుంటలేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సత్తయ్య, మహేశ్ గౌడ్, నాయకులు రమేశ్‌గుప్త, రాజేందర్‌సింగ్, కిశోర్‌రెడ్డి, మల్లేశం, మనోహర్ యాదవ్, ప్రసాద్‌రావు, లక్ష్మణ్‌గౌడ్ పాల్గొన్నారు.
హుస్నాబాద్‌రూరల్: మండలంలోని తోటపల్లి శివారు గుడిబండ దేవాలయం సమీపంలో ఆదిమానవులు ఆహార సేకరణలో రాతి పనిముట్లను నూరుకున్న సూరుడు గుంతలను చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ బుధవారం గుర్తించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తరాతి యుగం నాటి ఆదిమానవులు రాతితో పనిముట్లు తయారు చేసుకొని జీవనం సాగించేవారన్నారు. రాతి పని ముట్లతో వ్యవసాయం, వేట సాగించేవారని, గుడి బండ మీద 30కి పైగా (గూవ్స్) రాతి పనిముట్లు నూరిన గుంతలు ఉన్నాయన్నారు. ఇక్కడే ఒక డోల్మెన్ సమాధిని పోలిన ఆకృతి ఉందని వివరించారు.


