కొల్చారం(నర్సాపూర్): బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే బలం.. బలగమని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిర్వీర్యం అయ్యా యని ఆరోపించారు. గతంలో తెలంగాణను దేశంలోని నంబర్ వన్‌గా నిలిపేందుకు కేసిఆర్ ఎంతో కృషి చేశారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలకు అండగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని రద్దు చేయాలని చూడడం సరికాదన్నారు. సకాలంలో రైతు బీమా చెల్లించకపోవడం, వ్యవసాయానికి 20 గంటల విద్యుత్తు అని చెప్పి 12 గంటలు మాత్రమే ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్‌గుప్తా, యూత్ పార్టీ అధ్యక్షుడు సంతోశ్‌రావు, సోషల్ మీడియా కన్వీనర్ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మేఘమాల, వివిధ గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి


