కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో కోతుల బెడద నివారణకు పటిష్ట చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో పటిష్ట ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధ వారం కలెక్టరేట్‌లో మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్లు, అటవీశాఖ, జిల్లా పంచాయతీ శాఖల అధికారులతో సమన్వయ సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. జిల్లాలో కోతుల బెడద నియంత్రణ ఒక ఉద్యమంలా చేపట్టి దశలవారీగా నిర్మూలించడానికి అందరి సహాయ సహకారాలు తీసుకుంటామన్నారు. చదువుకునే విద్యార్థిని విద్యార్థులు కూడా వీటి దాడిలో గాయపడినట్లు ప్రజావాణిలో అనేక విన్నపాలు వచ్చాయన్నారు. అనంతరం ట్రిపుల్‌ఆర్ భూ సేకరణ ప్రక్రియపై సమీక్షించారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ‘సర్’పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓలు రమాదేవి, రామకృష్ణ, బావయ్య, నేషనల్ హైవేస్ మేనేజర్ రాహుల్, రైల్వే ఎస్సీ ధర్మారావు, రాకేష్, తహసీల్దార్లు పాల్గొన్నారు.


