ఇంటర్‌కు సాంకేతిక సొబగులు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌కు సాంకేతిక సొబగులు

Aug 20 2026 7:26 AM | Updated on Aug 20 2026 7:26 AM

ఇంటర్‌కు సాంకేతిక సొబగులు

కళాశాలలకుకంప్యూటర్‌ ల్యాబ్‌లు

నారాయణఖేడ్‌: పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఇంటర్‌ విద్యార్థులకు టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కంప్యూటర్‌ బోధనను చేరువ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో రూ.20 కోట్లతో 80 కళాశాలల్లో అవకాశం కల్పించగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 12 కళాశాల లకు అవకాశం దక్కింది. ఇందుకు గాను ఉమ్మడి జిల్లాలోని 12 కళాశాలలకు రూ.3 కోట్లు విడుదల అయ్యాయి. వీటితో అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌ను గదులను ఏర్పాటు చేయనున్నారు.

6 నెలల్లోపు ల్యాబ్‌ల నిర్మాణం

ఒక్కో కళాశాలో కంప్యూటర్‌ గది నిర్మాణం, ఆయా ఏర్పాట్లకు గాను రూ. 25 లక్షల చొప్పున కేటాయించింది. ఈ నిధులతో గదుల నిర్మాణం, ఫర్నీచర్‌, విద్యుదీకరణ, ఇతర వసతులను కల్పిస్తారు. పనుల బాధ్యతను తెలంగాణ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేయిర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఈడబ్ల్యూడీసీ)కి ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో టెండర్లు పిలిచి త్వరలో పనులు చేపట్టనున్నారు. టెండరు ప్రక్రియ పూర్తయ్యాక ఆరు నెలల్లోపు కంప్యూటర్‌ ల్యాబ్‌ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి రానున్నాయి. విద్యా సంవత్సరం చివరి వరకు విద్యార్థులకు కంప్యూటర్‌ బోధన అందుబాటులోకి రానుంది. సంగారెడ్డి జిల్లాలో 5, మెదక్‌ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 3 కళాశాలలకు ఈ దఫాలో అవకాశం కల్పించారు.

సాకేతిక నైపుణ్యం అందించేలా..

ఇంటర్‌ విద్యలో కంప్యూటర్‌ బోధన ప్రాథమి క హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ పరిచయంతో పాటు ఆఫీస్‌ టూల్స్‌, ఇంటర్నెట్‌ వినియోగ, ప్రాథమిక ప్రొగ్రామింగ్‌ భాషలపై ప్రధానంగా బోధన సాగనుంది. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించేలా సిలబస్‌ ఉండనుంది.

మంజూరైన కళాశాలలు ఇవే..

సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్‌, పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, సంగారెడ్డిలోని బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు, మెదక్‌ జిల్లాలోని మెదక్‌, పాపన్నపేట, కౌడిపల్లి, నర్సాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, గజ్వేల్‌లోని బాలికల కళాశాలలకు కంప్యూటర్‌ ల్యాబ్‌లు కేటాయించారు.

ఉమ్మడి జిల్లాలో 12 కేటాయింపు

రూ.3 కోట్ల నిధులతో ఏర్పాటు

ఒక్కో కళాశాలకు రూ.25 లక్షలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement