జిల్లాకు గద్దర్‌ పేరు పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు గద్దర్‌ పేరు పెట్టాలి

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

మెదక్‌జోన్‌: గద్దర్‌ తన జీవితాన్ని ప్రజలకోసమే అర్పించారని మెదక్‌ జిల్లాకు ఆయన పేరుపెట్టాలని, తెలంగాణ సాంస్కృతిక చైర్‌పర్సన్‌ డాక్టర్‌ గుమ్మడి వెన్నెల కోరారు. గద్దర్‌ మూడవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న గద్దర్‌ విగ్రహస్థలంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...గద్దర్‌ జీవితాంతం పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే త్యాగం చేశారని, ఆ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ సాంస్కృతిక చైర్‌పర్సన్‌

డాక్టర్‌ గుమ్మడి వెన్నెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement