జయశంకర్‌ ఆశయసాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి పర్యాటకులు రావొద్దు

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

పెద్దశంకరంపేట(మెదక్‌): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్‌ జయంతి సందర్భంగా గురువారం పెద్దశంకరంపేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ అందరికి ఆదర్శప్రాయులన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నారాయ ణ, ఎంపీడీఓ క్రాంతికుమార్‌, ఆర్‌ఐ.నాగరా జు, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్‌ తదితరులున్నారు.

రామాయంపేటలో...

రామాయంపేట(మెదక్‌): తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు పిలుపునిచ్చారు. ఆయన గురువారం రామాయంపేటలో మున్సిపల్‌ చైర్మన్‌ లావణ్యతో కలిసి జయశంకర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జయశంకర్‌ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్నానని, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే సిద్దిపేట, మెదక్‌ చౌరాస్తాల విస్తరణ, వివేకానంద, అంబేద్కర్‌ కొత్త విగ్రహాల ఏర్పాటుకోసం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారాం, స్వర్ణకార సంఘం జిల్లా అద్యక్షుడు రవి, జిల్లా నాయకులు సుంకోజ దామోదర్‌, జిల్లా విలేకరుల సంఘం అధ్యక్షుడు శంకర్‌ దయాల్‌చారి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): కార్మికులకు పని గంటలు పెరిగి, వారి హక్కులను హరించే విధంగా ఉన్న నాలుగు లేడర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మండల పరిధిలో అజ్జమర్రి గ్రామంలో ఈ నెల10న సీఐటీయూ, రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే జైల్‌ భరోను కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. 2025 విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయడంతో పాటు, విత్తన చట్టం సైతం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మల్లేశం, శేఖర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

పోచారం డ్యామ్‌కు వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ప్రస్తుతం పోచారం డ్యామ్‌ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు పోచారం డ్యామ్‌ వద్దకు రావొద్దని హవేళిఘణాపూర్‌ పోలీసులు సూచించారు. కామారెడ్డి జిల్లాలో అధికంగా వర్షాలు పడుతున్నందున భారీ వరద ఉధృతి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు రానివ్వకుండా అధికారుల సూచనల మేరకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ వెల్లడించారు. ప్రజలు ప్రస్తుతం పోచారం డ్యామ్‌ పరిసరాలకు అనుమతి లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement