విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి

Jul 26 2026 7:54 AM | Updated on Jul 26 2026 7:54 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనుల పరిశీలన

రామాయంపేట(మెదక్‌): విద్యార్థులు చదువులో ప్రపంచంతో పోటీపడే విధంగా ముందుకు సాగా లని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. శనివారం రామయంపేట పట్టణ శివారులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నామని తెలిపారు. రామాయంపేటలో రూ.200 కోట్లతో స్కూల్‌ భవన నిర్మాణ సముదాయం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయా లని సూచించారు. వచ్చే ఏడాదికల్లా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట డీఈఓ రాజు, విద్య, సంక్షేమ మౌలిక సదు పాయాల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రజని, జిల్లా గణాంక అధికారి నవీన్‌, మేఘ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఆంజనేయులు ఉన్నారు.

గణితం బాగా నేర్చుకోవాలి

చేగుంట(తూప్రాన్‌): విద్యార్థులు గణితం బాగా నేర్చుకోవాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సూచించారు. శనివారం చేగుంట కేజీబీవీని సందర్శించి పదో తరగతి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఫాస్ట్‌ మ్యాథ్స్‌ పుస్తకంలోని అంశాలను నేర్చుకుంటే గణితంలోని లెక్కలను సులభంగా సాధించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పాఠశాల వంటశాల, స్టోర్‌రూంను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement