చేగుంట(తూప్రాన్)/మెదక్ కలెక్టరేట్: రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మాసాయిపేట మండలం పోతన్‌శెట్టిపల్లిలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మ్యాపింగ్‌తో ప్రతి రైతుకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురికాకుండా ఉంటుందని తెలిపారు. సర్వే నంబర్ల ప్రకారం హద్దులను నిర్ణయించి రికార్డులను తయారు చేస్తున్నట్లు చెప్పారు. రీ సర్వేలో చేసిన మ్యాపింగ్ ద్వారా రైతులకు సంబంధించిన భూ వివాదాలను పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామ శివారులోని చెరువు శిఖం భూమిని పరిశీలించి చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్ ప్రశాంత్, తూప్రాన్ ఆర్డీఓ బావయ్య, ల్యాండ్ సర్వే ఏడీఏ కిషన్, ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్‌ఐ ధన్‌సింగ్, సర్వేయర్లు అరుణ్, నర్సింలు తదితరులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జలసిరిపై హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జలసిరి కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అదనపు కలెక్టర్ నగేశ్


