మెదక్ కలెక్టరేట్: సామాజిక రుగ్మతలను సమూలంగా రూపుమాపడమే కాకుండా బాల్య వివాహాల నిర్మూలనపై సంఘటితంగా పోరాడుదామని అదనపు కలెక్టర్ నగేశ్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన, పాఠశాల విడిచిన పిల్లల గుర్తింపు, అనాథ పిల్లలకు ప్రభుత్వ పథకాల అమలు, పోక్సో కేసుల సమీక్ష, పిల్లల హక్కులపై గ్రామస్థాయిలో అవగాహన తదితర కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ప్రతి నెల డ్రాప్ అవుట్ విద్యార్థుల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. పాఠశాల విడిచిన పిల్లలకు కౌన్సెలింగ్ అందించేందుకు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ సేవలను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. పోక్సో, చైల్డ్ మ్యారేజ్ జరిగిన పిల్లలను తప్పకుండా స్కూల్లోకి అనుమతించాలని ఆదేశించారు. జిల్లాలో పిల్లల పరిరక్షణకు సంబంధించి అన్ని శాఖలు సమష్టిగా పనిచేసి తదుపరి సమావేశానికి చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఈఓ రాజు, సీపీఓ సురేశ్, వైద్యారోగ్య శాఖ అధిశాఖ జ్ఞానేశ్వర్, జిల్లా ఇంటర్ అధికారి మాధవి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి సింధు, డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్


