టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మాలారెడ్డి
జహీరాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మాలారెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ తిరిగి ఓటరుగా నమోదు అయ్యారా లేదా అనే వివరాలను తెలుసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటే వారి సమాచారం తెలుసుకోవాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ విషయంలో తెలియని వారికి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఉజ్వల్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా, అసెంబ్లీ కో–ఆర్డినేటర్ మహ్మద్ గౌస్, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు యూనూస్, అశోక్, సీడీసీ చైర్మన్ ముబీన్, ఆయా మండలాల పార్టీ నాయకులు నరేష్‌గౌడ్, మల్లన్నపాటిల్, రాములు, నర్సింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, పవన్ రాథోడ్, ముజఫర్, శ్రీనివాస్‌రెడ్డి, మక్సూద్, కండెం నర్సింహులు, సామెల్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


