నర్సాపూర్: విధుల్లో క్రమశిక్షణ అవసరమని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సీసీ కెమెరాలు నిరంతరం పని చేసేలా చూడాలని, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. డ్రంకెన్ డ్రైవ్‌పై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ రంగకృష్ణ, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఉన్నారు.


