మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యనందిస్తున్నామని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని 12వ వార్డులోని టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీ (బాలికల) కళాశాలలో సుమారు రూ.4 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హాస్టల్ భవనం, ఓవర్‌హెడ్ వాటర్‌ట్యాంక్, సీసీ రోడ్లు, యార్డ్ లైటింగ్ వంటి మౌలిక వసతుల పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. బాలికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా అవసరమైన అన్ని సౌకర్యాలను దశలవారీగా కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్, కౌన్సిలర్లు అనీస్ ఫాతిమా, హరిత, సంపత్, రామకృష్ణ, గౌస్, నర్సింలు, కో–ఆప్షన్ సభ్యుడు తాహెర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు రాగి అశోక్, భూపతి రాజు, కళాశాల ఆర్సీ గంగారాం నాయక్, అధ్యాపకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రోహిత్‌రావు


