● జిల్లాలో విరివిగా బోరు బావుల తవ్వకం
● ‘ఎంఎస్‌ఎస్‌ఓ’ ద్వారా సేవా కార్యక్రమాలు
మెదక్‌జోన్: సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో జిల్లాలోని అనేక గ్రామాలకు తాగు నీరు సరిగా రావడం లేదు. అంతే కాకుండా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక భూగర్భజలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడింది. ముఖ్యంగా గిరిజన తండాల్లో ఈ తీవ్రత అధికంగా ఉంది. ఈక్రమంలో ‘ఎంఎస్‌ఎస్‌ఓ’ ద్వారా బోరు బావులు తవ్విస్తూ సింగిల్ ఫేజ్ మోటార్లు అమర్చి తాగునీటి ఎద్దడి తీరుస్తున్నారు. గడిచిన రెండు, మూడు నెలల్లో నియోజకవర్గంలో సుమారు 80కి పైగా బోరు బావు లు తవ్వించి ప్రజల దాహం తీరుస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 300 మోటార్లు అమర్చారు. ఒకవైపు ఎమ్మెల్యేగా, మరో వైపు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజర్‌గా రోహిత్‌రావు రాణిస్తున్నారు.
‘పై చిత్రంలో కనిపిస్తున్న వారు నునావత్ సంత్యాలి, శారద. చిన్నశంకరంపేట మండలం ప్యాటగడ్డ పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట తండా. కొంతకాలంగా తండాకు మిషన్ భగీరథ నీరు రావటం లేదు. పంట పొలాల్లో బోర్ల నుంచి నీరు తెచ్చుకొని దాహం తీర్చుకుంటున్నారు. దీంతో ఇటీవల మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజింగ్ (ఎంఎస్‌ఎస్‌ఓ) ద్వారా తండాలో బోరు తవ్వించి సింగిల్ ఫేజ్ మోటార్ బిగించి నీటి బాధ తీర్చారు. ఇది ఒక్క ఎర్రగుంట తండాలోనే కాదు మెదక్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో బోర్లు తవ్వించి తాగునీటి సమస్య తీరుస్తున్నారు’.


