పూజలు ఘనం
ఆరోవారం..
రాజగోపురం ఎదుట భక్తుల సందడి
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఆరోవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)
పూజలు ఘనం


