నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
కలెక్టర్ రాహుల్‌రాజ్
వెల్దుర్తి(తూప్రాన్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయించుకునేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రతి నెలా ఉచితంగా మందులను పంపిణీ చేయాలన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట సూపర్‌వైజర్ లలిత, ఎంఎల్‌హెచ్‌పీ స్వప్న, ఏఎన్‌ఎం రజని తదితరులు ఉన్నారు. అనంతరం కేజీబీవీని తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులు, స్టోర్ రూంను పరిశీలించారు. విద్యా బోధన, భోజన సదుపాయం ఇతర మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.


