ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర
జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న 12,334మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
ఈనెల 25 నుంచి మార్చి 13 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రోజు విడిచి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. అలాగే బైపీసీ విద్యార్థులకు మార్చి 14 నుంచి 18 వరకు పబ్లిక్ అడ్మిన్ 1, బ్రిడ్జ్ మాథ్స్ 1, మోడర్న్ లాంగ్వేజ్ 1, జియోగ్రఫీ 1 విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 12,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్ 5,710 మంది, ఒకేషనల్ విభాగంలో 599 మొత్తం 6,309 మంది, ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్ 5,472 మంది, ఒకేషనల్ 553 మంది మొత్తం 6,025 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 28 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని డివిజనన్‌్ కేంద్రాల్లో సైతం సెంటర్లు ఏర్పాటు చేశారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
విద్యాశాఖ, కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు అంతా సిద్ధం చేశాం. ఇప్పటికే అధికారులు, సిబ్బందికి పరీక్షలపై శిక్షణ సైతం ఇచ్చాం. పరీక్షలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్వ్యాడ్ బృందాలతో పాటు జిల్లా పరీక్షల విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– మాధవి, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి
ఈనెల 25 నుంచి ప్రారంభం


