గిరిజనుల అభివృద్ధికి సహకారం | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల అభివృద్ధికి సహకారం

Feb 21 2026 8:53 AM | Updated on Feb 21 2026 8:53 AM

గిరిజనుల అభివృద్ధికి సహకారం

గిరిజనుల అభివృద్ధికి సహకారం

నర్సాపూర్‌: గిరిజనుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం సంత్‌ సేవాలాల్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సంత్‌ సేవాలాల్‌ ఆలయ నిర్మాణానికి తన వంతుగా రూ. 2 లక్షల విరాళం ఇస్తానని ప్రకటించారు. ఆలయం పక్కన నిర్మిస్తు న్న ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ను పూర్తి చేసేందుకు రూ. 20 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపానని, నిధులు మంజూరు చేయించేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని కులాలకు సమన్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా చౌరస్తా నుంచి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బుచ్చెష్‌యాదవ్‌, ఆయా పార్టీల నాయకులు మురళీయాదవ్‌, బాల్‌రెడ్డి, రాజుయాదవ్‌, రాజేందర్‌, రమేశ్‌గౌడ్‌, శేఖర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement