టీవీ, ఫోన్లకు దూరంగా ఉండండి
కొల్చారం(నర్సాపూర్): పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ విద్యార్థులకు సూచించారు. మండలంలోని పోతంశెట్టిపల్లి ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. బట్టి చదువులకు స్వస్తి చెప్పి పలికి, విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రశ్న ఏ రకంగా వచ్చినా, సమాధానం రాసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. టీవీ, సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఎంఈఓ ఉమారాణి, సర్పంచ్ దయాకర్‌గౌడ్, ఉపాధ్యాయులు ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


