పెండింగ్ బిల్లులు చెల్లించండి
మెదక్ కలెక్టరేట్: గ్రామ పంచాయతీల్లో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని హవేళిఘణాపూర్ మండల మాజీ సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డీపీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ సర్పంచ్‌లు ఒంటరి రాజేందర్‌రెడ్డి, నోముల శ్రీకాంత్ మాట్లాడుతూ.. మండలంలోని 28 పంచాయతీల్లో సుమారు రూ.కోటికి పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినప్పటికీ సొంతంగా శానిటేషన్ పనులు, ట్రాక్టర్ల డీజిల్, విద్యుత్ దీపాలు, తాగునీటి వసతులు వంటి అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఒక్కో సర్పంచ్‌కు లక్షలాది రూపాయలు రావా ల్సి ఉందన్నారు. కార్యాలయంలో డీపీఓ యాదయ్య లేక పోవడంతో సీనియర్ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఫోన్ ద్వారా డీపీఓను సంప్రదించగా సానుకూలంగా స్పందించి బిల్లులు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, యామిరెడ్డి, శ్రీను నాయక్, సుభాష్, రంజా, రమేశ నాయక్ పాల్గొన్నారు.


