ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కేసీఆరే | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కేసీఆరే

Feb 18 2026 8:08 AM | Updated on Feb 18 2026 8:08 AM

ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కేసీఆరే

ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కేసీఆరే

ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కేసీఆరే

ప్రాణాన్ని పణంగా పెట్టి

రాష్ట్రాన్ని సాధించారు

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి కొనియాడారు. మెదక్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్‌ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతన కౌన్సిలర్లతో కలిసి పద్మారెడ్డి కేక్‌కట్‌చేసి సంబురాలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..పదేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను 29వ రాష్ట్రం నుంచి నంబర్‌వన్‌ స్థాయికి తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. జిల్లా తరఫున బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు తరఫున కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డితోపాటు నూతన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement