నర్సాపూర్ చైర్‌పర్సన్‌గా లక్ష్మి
వైస్ చైర్మన్‌గా బుచ్చెష్‌యాదవ్ ● ఏకమైన కాంగ్రెస్, బీజేపీలు
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పొత్తుతో రెండు పదవులు చేజిక్కించుకున్నాయి. చైర్‌పర్సన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకోగా.. వైస్ చైర్మన్ పదవిని బీజేపీ కై వసం చేసుకుంది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రమాదేవి ఆధ్వర్యంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ ఎన్నికలు నిర్వహించారు. చైర్‌పర్సన్ పదవి కోసం లక్ష్మీయాదవ్ పేరును ప్రతిపాదించగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పది మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. అయితే చైర్‌పర్సన్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు సునీతారెడ్డి, సమీనాబేగం, కండెల రాజు, మోహిజ్ ఉద్దీన్, లలితలను తీసుకొచ్చారు. తాము లేకుండా ఎన్నిక ఎలా నిర్వహించారని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. కోరం ఉన్నందున ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎన్నికల అధికారులు చెప్పారు. అనంతరం వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించగా బీజేపీకి చెందిన వి.బుచ్చెష్‌యాదవ్ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పది మంది కౌన్సిలర్ల ఓట్లతో గెలుపొందగా.. అధికారులు ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి అధికారులు వారికి ధృవపత్రాలు అందజేశారు.
నర్సాపూర్ చైర్‌పర్సన్‌గా లక్ష్మి


