మెదక్ చైర్‌పర్సన్‌గా రాధిక
వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్ ● కాంగ్రెస్‌కు బీజేపీ పరోక్ష మద్దతు
మెదక్‌జోన్: మెదక్ మున్సిపల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. చైర్మన్‌గా కానుగ రాధిక, వైస్ చైర్మన్‌గా దొంతి నరేశ్‌గౌడ్‌ను ఎన్నికయ్యారు. బీజేపీ పరోక్ష మద్దతుపాటు ఎక్స్‌అఫీషియో ఓటుతో కాంగ్రెస్ గట్టెక్కింది. మెదక్ బల్దియాలో 32 వార్డులు ఉండగా బీఆర్‌ఎస్‌కు 15 సీట్లు, అధికార కాంగ్రెస్‌కు 14, బీజేపీకి 2, బీఎస్పీకి ఒకటి చొప్పున వచ్చాయి. బీఎస్పీ కౌన్సిలర్ భుజరంపేట అరుణ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమానంగా 15 సీట్ల చొప్పున సంఖ్యాబలం పెరిగింది. మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొందిన అభ్యర్థులతో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలను అధికారులు కోరురు. కాంగ్రెస్ అభ్యర్థి 24వ వార్డు నుంచి గెలుపొందిన కానుగ రాధికను చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ కౌన్సిలర్ మన్సూర్ ప్రతిపాదించారు. మరో సభ్యుడు గంట సంపత్ బలపరిచాడు. బీఆర్‌ఎస్ తరపున చైర్మన్ అభ్యర్థిగా 3వ వార్డు కౌన్సిలర్ కొట్టాల లలిత ప్రతిపాదించగా.. ఆ పార్టీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు బలపరిచాడు.
మెదక్ చైర్‌పర్సన్‌గా రాధిక


