ఢిల్లీలో వైరం... గల్లీలో స్నేహమా..?
మెదక్‌జోన్: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీలు నిత్యం గొడవులు పడుతుండగా మెదక్ బల్దియాలో చైర్మన్ పీఠం కోసం ఒకరికొకరు సహకరించుకోవడం అనైతిక చర్య అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు 15 సీట్లు రాగా, అధికార కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 సీట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. అనైతిక పొత్తుతో బీజేపీ, బీఎస్పీల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిని చైర్మన్‌గా గెలిపించుకున్నా, నైతికంగా మాత్రం బీఆర్‌ఎస్‌దే గెలుపని చెప్పారు. మెదక్‌లో అవినీతి జరగకుండా చూసే బాధ్యత తమ కౌన్సిలర్లపై ఉందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, నూతనంగా ఎన్నికై న 15 మంది కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లది
అనైతిక పొత్తు: పద్మారెడ్డి


